ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాక్షస ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయు: గంటా

ETV Bharat / videos

Ganta on Pawan cases ప్రజల పరువు తీసి.. పవన్ కల్యాణ్​పై కేసు పెట్టారు!: టీడీపీ నేత గంటా - AP Latest News

By

Published : Jul 22, 2023, 3:48 PM IST

Ganta comments on Pawan cases: గడిచిన నాలుగున్నరేళ్లలో.. ప్రజలకు జగన్ ఏం పరువు మిగిల్చి పవన్ కల్యాణ్ మీద కేసు పెట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాజధాని ఏదో చెప్పుకోలేక.. పరిశ్రమలు లేక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి తెచ్చినందుకు ప్రజలే జగన్​పై పరువు నష్టం కేసు పెట్టాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామని గొప్పలు చెప్పి.. దిల్లీలో తలదించుకుని ప్రజలను వంచించినందుకు సీఎంపై పరువు నష్టం వేయాలన్నారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నోటిఫికేషన్ హామీలకు మోసపోయిన నిరుద్యోగులు.. ఇసుక విధానం వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, అమ్మఒడి హామీకి మోసపోయిన తల్లులు, సకాలంలో జీతాలు రాని ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలు ముఖ్యమంత్రిపై పరువు నష్టం వేయాల్సిన వారేనని గంటా అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి పాలుచేసి, వ్యవస్థల దుర్వినియోగంపై ప్రశ్నించిన పవన్​పై పరువు నష్టం కేసు పెట్టడం దారుణమన్నారు. రాక్షస ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details