ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YarlaGadda

ETV Bharat / videos

Yarlagadda Meet With Dutta: వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తా: యార్లగడ్డ వెంకట్రావు - Ycp news

By

Published : Jul 24, 2023, 5:42 PM IST

Gannavaram YCP leader Yarlagadda met with Dutta: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించిన వెంకట్రావు.. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయాలా..? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలా..? అనే అంశంపై కీలక విషయాన్ని వెల్లడించారు.

త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తా..ఓ కేసు విషయమై సోమవారం కోర్టు వాయిదాకు వెళ్తూ.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా రాష్ట్రంలో రానున్న సాధారణ ఎన్నికల్లోవైఎస్సార్సీపీ తరపున పోటీ చేయాలా..? స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలా..? అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొందని.. జగన్‌తో సమావేశమైన తర్వాత తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్లే 2019 ఎన్నికల తర్వాత తాను నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని, తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని.. కార్యకర్తలకు వెంకట్రావు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details