ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganesh_Idol_Making

ETV Bharat / videos

Ganesh Idol Making: పర్యావరణ పరిరక్షణే ఆయన లక్ష్యం.. 51 నదీ జలాలతో గణేషుడి మట్టి విగ్రహాల తయారీ, పంపిణీ - పశ్చిమ గోదావరి జిల్లా లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 5:11 PM IST

Ganesh Idol Making: కాలుష్య గణేశ్ నవరాత్రోత్సవాలు జరుపుకొనేందుకు విద్యావంతులు, సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాల ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు కోరిన మేరకు కొన్ని వినాయక సేవా సమితులు, మండళ్ల ప్రతినిధులు సంప్రదాయ పద్ధతిలో మట్టితో విగ్రహాలను తయారు చేయించాలని భావిస్తున్నారు. తద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ( Plaster of Paris ) విగ్రహాల తయారీ తగ్గుదల కనిపించే అవకాశముంది. మరోవైపు అందమైన ఆకృతుల కోసం.. కళ్లకు కనువిందు చేసేందుకు రసాయక రంగులను అద్ది విగ్రహాలను అమ్మకానికి పెట్టేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మట్టి, ప్రకృతిసిద్ధంగా లభించే ఆకుకూరలు, కాయగూరలతో వినాయక ప్రతిమలను తయారుచేసి పూజలు చేయాలని పలు చోట్ల కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కంచర్ల కాశీ విశ్వేశ్వరరావు గత కొన్నేళ్లుగా మట్టి వినాయక ప్రతిమలు ( Clay Ganesha idols ) తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దేశంలోని 51 పవిత్ర నదీ (కాశీ గంగా, అమర్​నాధ్ గంగా, గంగోత్రి, కృష్ణా, గోదావరి, యమున) జలాలను తెప్పించి.. తులసి విత్తనాలు, నది మట్టితో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 8 వేల విగ్రహాలు తయారు చేయించి భక్తులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు కృషి చేయాలని విశ్వేశ్వర్​రావు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details