కరెన్సీ నోట్లతో గణేష్ విగ్రహానికి అలంకరణ.. - GANESH IDOL WITH CURRENCY
GANESH IDOL WITH CURRENCY : వినాయక చవితి పండుగ అంటే వివిధ రూపాల్లో ఉన్న గణనాథులే కాదు.. రకరకాల ఆకృతుల్లో తయారుచేసిన మండపాలు దర్శనమిస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయక విగ్రహాన్ని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారితో పాటు మండపాన్ని కొత్త కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. లక్ష్మీ గణపతిగా తీర్చిదిద్దిన అనంతరం నిర్వాహకులు.. లక్ష్మీ కుబేర హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. కరెన్సీ గణేషుడిని దర్శించుకున్నారు. గణనాథుడి ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST