Variety Gifts To New Couple: నూతన వధూవరులకు వెరైటీ గిఫ్ట్స్.. అంతా నవ్వులే నవ్వులు - AP NEWS LIVE UPDATES
Variety Gifts To Newlyweds : రెండవ జీవితానికి నాంది పలికే పెళ్లిలో మిత్రులు ఇచ్చే బహుమతులు జీవితంలో ఎప్పటికీ మరచిపోకుండా ఉండాలని అనుకుంటారు నూతన దంపతులు. వీరి మిత్రులు మాత్రం నూతన దంపతులకు వెరైటీ బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ బహుమతులను చూసిన దంపతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పెళ్లిళ్లు జరిగితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకు వారి స్నేహితులు గోడ గడియారాలు, దేవుని ఫొటోలువంటి గిఫ్టులు ఇస్తుంటారు. అయితే నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం రంగన్నపాడు గ్రామంలో జరిగిన షేక్ ఇమ్రాన్ అనే యువకుడి పెళ్లిలో తన మిత్రులు కాస్త వెరైటీగా ఆలోచించారు. అందరిలా కాకుండా వెరైటీగా బకెట్, టాయిలెట్ క్లీనింగ్ బ్రష్, చిన్న పిల్లలకు అవసరమైన డైపర్ ప్యాకెట్, ప్లాస్టిక్ చాట, అప్పడాల కర్ర, చీపురు, మాఫ్, త్రిబులెక్స్ వాషింగ్ పౌడర్, హార్పిక్ బాత్రూం క్లీనర్, మగ్గు వంటి ఫన్నీ గిఫ్ట్‌లను కొత్త జంటకు అందజేశారు. ఈ ఫన్నీ గిఫ్టుల తతంగాన్ని చూసిన పెళ్లి పెద్దలు, వివాహానికి వచ్చిన బంధువులంతా నవ్వుకున్నారు.