ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సిగరెట్ల వ్యాపారం పేరుతో కోట్లకు టోకరా

ETV Bharat / videos

Fraud: మోసానికి ఏదీ కాదు అనర్హం.. సిగరెట్ల వ్యాపారం పేరుతో కోట్లకు టోకరా.. !

By

Published : Jul 22, 2023, 6:51 PM IST

Updated : Jul 22, 2023, 7:39 PM IST

Cigarette Business Fraud Case: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సిగరెట్ల హోల్ సేల్ వ్యాపారం పేరుతో పలువురు నుంచి రూ.4కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. రెండు నెలల క్రితం బద్వేలుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి నెల్లూరుపాలెం వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మినీ ట్రక్కులు నిత్యం ఇంటి వద్దకు వచ్చి వెళుతూ ఉండేవి. ఖరీదైన కార్లలో తిరుగుతూ తాను హోల్​సేల్​గా సిగరెట్ల వ్యాపారం చేస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాకుండా తనకు సిగరెట్ల వ్యాపారంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పలువురిని నమ్మించటమే కాక తన వ్యాపారంలో వారిని కూడా భాగస్వామవ్వమంటూ చెప్పేవాడు. ఇలా ఇంటి యజమాని రోశయ్యతో పాటు పలువురు నుంచి సుమారు రూ.4కోట్లకు పైగా డబ్బులను వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయించాడు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలను పగలగొట్టి గదిలోపల ఆధారాల కోసం పరిశీలన చేపట్టారు. 

Last Updated : Jul 22, 2023, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details