ఆంధ్రప్రదేశ్

andhra pradesh

four_were_injured_in_short_circuit

ETV Bharat / videos

నిద్రిస్తున్న సమయంలో చెలరేగిన మంటలు - నలుగురికి తీవ్ర గాయాలు - షార్ట్​ సర్కూట్​తో మంటలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 3:27 PM IST

Four were Injured In Short Circuit: షార్ట్ సర్క్యూట్​తో ఇంట్లో మంటలు చేలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన రత్నరాజు (37), అతని భార్య  కుమారి (35), ఇద్దరు పిల్లలు సంజయ్ (12), శ్రీవిద్య (8) నిద్రిస్తున్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. 

మంటల్లో చిక్కుకున్న రత్నరాజు, అతని కుటుంబీకులు అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. 6లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details