ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Four_Peoples_Missing-_in_Kadapa

ETV Bharat / videos

కడపలో నలుగురు వ్యక్తులు అదృశ్యం - స్థానికుల్లో కలవరపాటు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 10:50 AM IST

Four Peoples Missing in Kadapa : కడపలో రెండు వేర్వేరు చోట్ల నలుగురు వ్యక్తులు అదృశ్యమవడం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది. రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో తల్లి, ఇద్దరు కుమారులు, మరో వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అదృశ్యమైన వారి కాల్‌  డేటా ఆధారంగా  ముమ్మరంగా  గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కడప సాధు చెంగన్న వీధికి చెందిన షేక్ అంజుమ్​కు, అదే ప్రాంతానికి చెందిన అల్తాఫ్ తో కొన్నేళ్ల  కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన షేక్ అంజుమ్ పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తానని చెప్పి వెళ్లింది.

అప్పుడు వెళ్లిన మహిళ ఎంతకి ఇంటికి రాకపోవడంతో షేక్ అంజుమ్ తల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతానికి చెందిన  మరో వ్యక్తి రవిశంకర్  గత వారం రోజుల నుంచి కనిపించకుండా పోయాడంటూ అతని భార్య లక్ష్మీదేవి  స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసు స్టేషన్‌ పరిధిలో నలుగురు వ్యక్తులు అదృశ్య కేసులు చూసి పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details