రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తాం: కేంద్రమంత్రి సింధియా - బీజేపీ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 5:53 PM IST
|Updated : Dec 10, 2023, 6:20 PM IST
Foundation Stone for Rajahmundry Airport Extension Works: రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో ప్రధానమైన రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 347.15 కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ భవనం, అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు పాల్గొన్నారు.
"రాజమండ్రిని అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతాం. మోడ్రన్ టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో నిర్మాణం జరుగుతుంది. కనీవినీ ఎరుగని రీతిలో రాజమండ్రిలో టెర్మినల్‌ను నిర్మిస్తాం. టెర్మినల్ నిర్మాణం తొందరలో పూర్తైతే రాజమండ్రి నుంచి అన్ని ప్రాంతాలకు విమానాలు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దేశంలో 10 నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు దీటుగా రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తాం." - జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి