ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Former_Union_Minister_Renuka_Chaudhary_Fires_On_YSRCP_Govt

ETV Bharat / videos

Former Union Minister Renuka Chaudhary Fires On YSRCP Govt: "ఎటువంటి ఆధారాలు లేకుండా హింసించి, వేధించడం న్యాయమా" - కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి x సీఎం జగన్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 11:44 AM IST

Former Union Minister Renuka Chaudhary Fires On YSRCP Govt: పిచ్చోడి చేతిలో రాయిలా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్​పై బయటకు వచ్చి బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్​మెంట్ పేరిట అబాంఢాలు మోపారని అన్నారు. కావాలనే ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు లేకుండా హింసించి, వేధించడం న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించి చేసే పరిపాలన ఎన్ని రోజులు సాగిస్తారని నిలదీశారు. జగన్​కు ఉన్న స్కిల్​ను మెచ్చుకోవాలని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. న్యాయం, ధర్మం పేరు చెప్పే షర్మిల, విజయమ్మ ఇంతవరకు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రాన్ని అంతా కలిసికట్టుగా ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details