ఆంధ్రప్రదేశ్

andhra pradesh

former_union_minister_chinta_mohan_press_meet

ETV Bharat / videos

రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ ?: చింతా మోహన్​ - ప్రభుత్వాన్ని విమర్శించిన కేెంద్ర మాజీ మంత్రి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 10:05 PM IST

Former Union Minister Chinta Mohan Press Meet :రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన విలేరుల సమావేశంలో.. దేశానికి ప్రధాన మంత్రులైన జవహర్ లాల్ నెహ్రో, ఇందిరా గాంధీ విగ్రహాలు తిరుపతిలో ఒక్కటి కూడా లేవని పేర్కొన్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను నాలుగు చోట్ల ఏర్పాటు చేశారని మండిపడ్డారు. నాలుగున్నర సంవత్సరంలో వైసీపీ పార్టీ సాధించిన ప్రగతి ఇదేనా అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్​గా పేరు మార్చి.. 152 మెడికల్, పీజీ సీట్లును రాష్ట్రం అడ్డదారిలో అమ్ముకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ధ్వజమైతారు. 

అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుంటే.. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం.. జైలు, బెయిల్ చూసుకోవాడానికే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో కులగణన చేస్తేనే చట్టబద్దత ఉంటుందని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేపట్టిన కులగణన చట్ట విరుద్దం అన్నారు. పొట్టకూటి కోసం వచ్చి.. ప్రమాదవశాత్తు సొరంగంలో ఇరుక్కుపోయిన కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు 15 రోజులు పట్టిందని.. ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 లో విజయవంతంగా పూర్తి చేసి భారతదేశం సాంకేతిక పరంగా అభివృద్ధి చెందామని ప్రపంచానికి చాటి చెప్పడం కాదు.. నిరుపేదలు కష్టాలలో ఉన్నప్పుడు ఆ సాంకేతికను వినియోగించాలని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details