ఆంధ్రప్రదేశ్

andhra pradesh

giddi_ishwari_car_accident

ETV Bharat / videos

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వాహనాన్ని ఢీకొట్టిన లారీ - తప్పిన పెను ప్రమాదం - AP accident news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 10:49 PM IST

Former TDP MLA Giddi Ishwari Car Met with an Accident:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకురాలు గిడ్డి ఈశ్వరికి పెను ప్రమాదం తప్పింది. కోర్టు పని మీద ఆమె విజయవాడ వెళ్తుండగా.. కాకినాడ జిల్లా బెండపూడి జాతీయ రహదారిలో లారీ వెనక నుంచి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. లారీ సమయానికి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బొలెరో వాహనం ముందు భాగం నుజ్జు కావడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి.. ఆమె వేరే వాహనంలో విజయవాడకు వెళ్లిపోయారు.

Bolero Goods Vehicle Fell Into Valley:మరోచోట అల్లూరి జిల్లాలోని పాడేరు మండలం రాయికోట గ్రామం వద్ద భారీ ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో గూడ్స్ వాహనం రాయికోట వద్ద లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఈదులపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాయికోట నుంచి రాజమండ్రికి వలస కూలీలు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details