Former PCC President Shailajanath Comments on Jagan: వైసీపీ వచ్చాక జగన్ దిల్లీకి వెళ్లడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు: శైలజానాథ్ - Drought in Anantapur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 1:45 PM IST
Former PCC President Shailajanath Comments on Jagan:ఇప్పటికే కరవుతో ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితులు వచ్చాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ చెప్పారు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కృష్ణా జలాలు ఉమ్మడి రాష్ట్రాలకు 811 టిఎంసిలు వచ్చాయన్నారు. 299 టీఎంసీలు తెలంగాణకి పోతే మిగిలిన నీరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని, ఈ నీరే సరిపోక రాయలసీమ ప్రాంతం గొంతుఎండి పోయే పరిస్థితులు చూస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జల కేటాయింపులు నిర్ణయం అనంత రైతుకు చావు దెబ్బగా ప్రకటించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగునీరు ప్రాజెక్టులకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టులన్ని మూలపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి దిల్లీకి వెళ్లడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి కావాల్సిన హక్కులు గాని లబ్ధిలు గాని సంపాదించలేదన్నారు. కృష్ణా జలాలను మొత్తం రాయలసీమ ప్రాంతానికి వచ్చేలా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయాలని కోరారు. అందర్నీ కలుపుకొని పోయి సమస్యను పరిష్కరించాలన్నారు.