సీఎం అయితే కోర్టుకు రారా- మాజీ ఎంపీ హర్షకుమార్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 6:05 PM IST
Former MP Harsha Kumar Deeksha: కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమండ్రిలోని తన ఇంట్లో దీక్షకు దిగారు. ఐదేళ్లుగా ఓ దళితుడిని జైలులో మగ్గేలా చేయడం దుర్మార్గమని హర్షకుమార్ మండిపడ్డారు. సాక్ష్యం చెప్పడానికి జగన్‌కు ఆ మాత్రం తీరిక లేదా, సీఎం అయితే కోర్టుకు రారా అని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్ రానిపక్షంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.
Harsha Kumar Demand To Release Kodi Katti Sreenu: జగన్పై దాడి విషయంలో ఎటువంటి కుట్ర లేదని ఎన్ఐఏ తెలిపిందని, ఒకసారి కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పడానికి జగన్ ఎందుకు వెళ్లటం లేదని హరిష్ ప్రశ్నించారు. దళితులపై జగన్ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. జగన్ రేపు విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఇష్టం లేదన్నారు. వైసీపీని ఓడించే వరకూ ఊరుకోమని, ఇప్పటికైనా కోడి కత్తి శ్రీను విడుదలకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి హర్షకుమార్ డిమాండ్ చేశారు.