ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yarapathineni Srinivasa Rao Dance

ETV Bharat / videos

అదిరిపోయిన సంక్రాంతి సంబరాలు - యరపతినేని శ్రీనివాసరావు స్టెప్పులు - దాచేపల్లి వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 7:33 PM IST

Yarapathineni Srinivasa Rao Dance: రాష్ట్ర వ్యాప్తంగా  సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా, సంక్రాంతి పండుగను ఆస్వాదిస్తున్నారు. బతుకు తెరువు కోసం పట్టణాలకు వెళ్లిన వారంతా పండగపూట కలిసి తమ కష్ట సుఖాలను పంచుకుంటున్నారు. ఇంటికి వచ్చిన చుట్టాలతో  కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.అయితే, ఎప్పటిలాగే  పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సైతం తన స్వంత గ్రామమైన దాచేపల్లిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఊరి జనం, బంధుగణంతో కలిసి ఆడిపాడి చిందులేశారు. 

 మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేశారు. దాచేపల్లిలో యరపతినేని ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వివిధ పాటలకు యరపతినేని నృత్యాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. స్థానికులతో పాటు గురజాల నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని చిందులేశారు. ఆయన ఉత్సాహాన్ని చూసి అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వేదిక కింద నుంచే డ్యాన్సులతో హోరెత్తించారు. 

ABOUT THE AUTHOR

...view details