అధికార పార్టీ వాహనాలు నంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్నా పట్టించుకోరా ! - జేసీ ప్రభాకర్ ఆందోళన - tadipatri update news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 4:56 PM IST
Former MLA JC Prabhakar's Protest : అధికార పార్టీకి చెందిన వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నా పట్టించుకోరా అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. పట్టణంలో ఎనిమిది కార్లు నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వాహనాలన్నీ అధికార వైసీపీకి చెందినవారివేనని ఆరోపించారు.
JC Demand to Fix Number Plates on Cars : తన ఇంటి చుట్టూ నంబరు ప్లేట్ లేని వాహనాలు చక్కర్లు కొడుతున్నాయని జేసీ ప్రభాకర్ అధికారులకు వివరించారు. నిరసనకు దిగిన జేసీకి ఆర్టీఏ అధికారులు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు. కార్లకు వెంటనే నంబరు ప్లేట్లు బిగించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో నంబరు ప్లేట్ లేని వాహనాలను గుర్తించి, తప్పనిసరిగా బిగిస్తామని జేసీకి అధికారులు హామీ ఇవ్వడం వల్ల ఆయన నిరసన విరమించారు.