Former MLA Gone Prakash Rao Comments on Chandrababu Arrest: "చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం.. జగన్ ఒక్కరోజు కూడా శాసనసభకు రాలేరు" - ap latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 11:10 AM IST
Former MLA Gone Prakash Rao Comments on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు అక్రమమని టీడీపీ నేతలు, ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై రాజకీయాలకు అతీతంగా నేతలు స్పందిచారు. తాజాగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు స్పందిస్తూ సీఎం జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gone Prakash Rao Fire on CM Jagan : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు అన్నారు. దిల్లీ ఏపీ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని, ఆయన సీఎం అయ్యాక జగన్ మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా శాసనసభకు రాలేరని.. హైదరాబాద్‌కో, బెంగుళూరు కుమార్తెల వద్దకో పారిపోవడం ఖాయమని అన్నారు. గతంలో నమోదైన కేసుల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు, ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గోనె ప్రకాశ్‌రావు హెచ్చరించారు.