ఆంధ్రప్రదేశ్

andhra pradesh

mla

ETV Bharat / videos

Protest: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కార్యకర్తల నుంచి నిరసన సెగ - గడపగడపకు మన ప్రభుత్వం

By

Published : May 1, 2023, 4:33 PM IST

Villagers obstructed the MLA: అధికార పార్టీ  ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసన సెగ తాకింది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం ఈదలబలాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల రేణుక నగర్​లో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించేందుకు వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకుని నిలదీశారు. రేణుక నగర్​లో ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశాడని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారాడని గ్రామంలోకి రాకుండా ప్రజలు రోడ్డుపైనే అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. గ్రామస్థులు పట్టు విడవకపోవడంతో శంకర్ నారాయణ అక్కడి నుంచి వెనుతిరిగారు. శంకర్ నారాయణ వాహనం వెళ్లిపోతుండగా వెనక నుంచి పలువురు చెప్పులు విసిరారు.

ఎమ్మెల్యేపై దాడి చేసిన రేణుక నగర్ వాసులు, వైఎస్సార్సీపీ  నాయకుడు నాగభూషణ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్​పై దాడి జరిగిందనే విషయం తెలుసుకున్న పెనుకొండ నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూఖ్ ఖాన్, పలువురు కౌన్సిలర్లు.. సోమందేపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన రౌడీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగభూషణ్ రెడ్డి, అతడి అనుచరులని బయటికి పంపాలని భీష్మించారు. పెనుకొండ వైఎస్సార్సీపీ నాయకులు, నగర పంచాయతీ చైర్మన్ పలువురు కౌన్సిలర్లు ఆందోళనలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details