Former Minister Celebrates His Death Day Ceremony బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి.. బతికుండగానే తన వర్ధంతి తతంగాన్ని నిర్వహించిన ఓ వైద్యుడు - మరణ దినోత్సవం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 6:04 PM IST
|Updated : Oct 14, 2023, 6:45 PM IST
Man Celebrates His death day Ceremony: ఎవరైనా.. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే వినూత్నంగా ఓ వ్యక్తి బతికుండగానే తన మరణ దినోత్సవం జరుపుకొన్నాడు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బంధువులను, స్నేహితులను పిలిచి భోజనాలు కూడా పెట్టారు. ఈ విచిత్ర సంఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. 1959వ సంవత్సరంలో జన్మించిన పాలేటి రామారావు.. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వృత్తి రిత్యా ఆయన వైద్యుడు. స్థానికంగా మంచి పేరున్న పాలేటి.. తాను 75 సంవత్సరాలు జీవించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 2034 చనిపోతానని, ఇలా చూస్తే.. తన 11వ మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. చీరాల పట్టంలోని డీడీడీ కల్యాణ మండపంలో తన వర్ధంతి తతంగాన్ని ఘనంగా నిర్వహించాడు. ఈ నేపథ్యంలో కేకు కట్ చేసి నియోజకవర్గంలోని పాలేటి అభిమానులు, స్నేహితులు, బంధువులకు తన అభిలాషను చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చావు, పుట్టుక గురించి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత బోధకులు వివరించారు. కాగా గతేడాది తన 12వ మరణదినాన్ని ప్రకటించటమేకాక ఘనంగా జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది తన 11వ మరణ దిన వేడుకలు నిర్వహించారు.
ఫంక్షన్ అంటే ఎంటో అనుకున్నాం.. పిలిస్తే వచ్చాం! ఇలాంటి ఫంక్షన్ చూడటం ఎక్కడా చూడలేదని.. తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని చూస్తున్నా.. ఏదో తెలియని ఆసక్తి రేగుతోందని.. ఈ మరణ దినోత్సవ కార్యక్రానికి హజరైన సభికులు తమ మనోగతాన్ని వెల్లడించారు.