Former Minister Kalava Srinivas House Arrest : 'డీజే మోతలతో బర్త్డే వేడుకలు.. పట్టించుకోని పోలీసులు .. శాంతియుత ర్యాలీపై కేసు' - Rally Relay
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 1:17 PM IST
Former minister Kalava Srinivas house arrest : అనంతపురంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాయదుర్గంలో శాంతియుత ర్యాలీ, రిలే దీక్షల్లో పాల్గొన్న వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని కాలవ మండిపడ్డారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయంటూ కాలవ శ్రీనివాసులు సహా టీడీపీ నేతలపై ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రహదారి కూడలిలో డీజే స్పీకర్ల మోతతో జన్మదిన సంబరాలు చేసినా చట్టాలు వర్తించవా అంటూ పోలీసులను కాలవ ప్రశ్నించారు.
అక్రమ కేసులు ఎత్తివేయాల్సిందేనని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవటంతో నేడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో అనంతపురంలోని ఇంటిలో కాలవ శ్రీనివాసులను పోలీసులు రాత్రి నుంచే గృహనిర్బంధం చేశారు. కోవూరునగర్ లోని ఆయన ఇంటి చుట్టుపక్కల భవనాలపై పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. కాలవ ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఏది ఏమైనా రాయదుర్గం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని కాలవ హెచ్చరించారు.