ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ex_mp_chintamani_condemned_lg-polymers

ETV Bharat / videos

ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్స్‌ తిరుపతికి రావడం దురదృష్టకరం - తక్షణమే నిషేధించాలి: చింతా మోహన్‍ - Former Minister Chinta Mohan comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 5:24 PM IST

Updated : Dec 9, 2023, 5:32 PM IST

Former Minister Chinta Mohan Condemned LG Polymers: తిరుపతి జిల్లా నుంచి తక్షణమే ఎల్జీ పాలిమర్స్‌ను నిషేధించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్స్‌ను జిల్లాకు తీసుకురావడాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సీఎం జగన్‌ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లను చూడొద్దని ముఖ్యమంత్రి చెప్పడం రాజ్యాంగ విరుద్ధమనేనని ఆయన ధ్వజమెత్తారు.

Chinta Mohan Comments:ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''తిరుపతికి ఎల్జీ పాలిమర్స్‌ను శ్రీ సిటీ తీసుకురావడాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ అనేది ఒక విష వాయువు. దీన్ని మూడేళ్ల క్రితం విశాఖపట్టణం దగ్గర ఓ గ్రామంలో మొదలుపెట్టారు. ఆ గ్యాస్ కారణంగా చాలామంది చనిపోయారు. వేలాది మంది రోగాల బారినపడ్డారు. ఇప్పుడు ఆ గ్యాస్ తిరుపతి జిల్లాకు రావడం చాలా దురదృష్టకరం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఎల్జీ పాలిమర్స్‌ను తిరుపతి నుంచి నిషేధించాలని శ్రీ సిటీ వారిని హెచ్చరిస్తున్నాం. అలాగే, ఓటర్ల జాబితాను నగరపాలక కార్యాలయంలో పెట్టడం ఏంటి?. వెంటనే ఓటర్ల జాబితాను తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.'' అని ఆయన అన్నారు.

Last Updated : Dec 9, 2023, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details