వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తా - అవసరమైతే కొత్త పార్టీ పెడతా: మాజీ జేడీ లక్ష్మీనారాయణ - Former JD Lakshminarayana will contest in Visakha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 9:31 PM IST
Former JD Lakshminarayana will Contest from Visakha in Next Elections:ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని.. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందేనని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి.. కొత్త ఆలోచనలను తీసుకొద్దామన్న సంకల్పం ఉంది.. ఆ సంకల్పాన్ని త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అలానే నేను కొత్త పార్టీ పెట్టాక యువత ఎవరు వచ్చినా నేను ప్రోత్సహిస్తానని అన్నారు. అది ఆలోచనలు ఉన్న యువత వస్తే మంచిది.. చదువుకున్నంత మాత్రాన మంచి ఆలోచనలు ఉండాలని లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఒక ప్రజాస్వామ్యం కోసం మంచి ఆలోచనలు ఉన్న ఎవరైనా వస్తే మంచిది.. ముఖ్యంగా యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తే బాగుంటుందని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేయాలంటే క్వాలిఫికేషన్ అవసరం అని రాజ్యాంగంలో కూడా లేదు.. కేవలం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోతుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.