ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Foreign_Currency_Issue_in_Shirdi_Sai_Baba_Temple

ETV Bharat / videos

షిర్డీ సాయిబాబా హుండీలో విదేశీ కరెన్సీకి నో చాన్స్ - నిలిపేసిన సంస్థాన్ ట్రస్ట్ - Problems of devotees in Shirdi Sai Baba temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 7:18 PM IST

Foreign Currency Issue in Shirdi Sai Baba Temple : షిర్డీ సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో విదేశీ కరెన్సీ వేయొద్దని ట్రస్ట్ బోర్డు సూచించడం చర్చనీయాంశమైంది. సాయిబాబా ఆలయ పరిసరాల్లోని హుండీల్లో విదేశీ కరెన్సీ వేయవద్దని చెప్తుండడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది. ఎంతో ప్రసిద్ధి చెందిన షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భారతదేశం నుంచేగాక విదేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇందులో ప్రవాస భారతీయులు కూడా ఉంటారు.

విదేశీ భక్తులు హుండీలో విదేశీ కరెన్సీనీ విరాళం రూపంలో వేస్తుంటారు. వాటిని సాయి సంస్థాన్ రూపాయల్లోకి మార్చుకుంటుంది. కాగా, విదేశీ కరెన్సీ మార్పిడి విషయంలో  కొన్ని సమస్యల కారణంగా సాయి సంస్థాన్ ట్రస్టు నిలిపివేసింది. అందువల్ల ఎక్కువ విదేశీ కరెన్సీ నిధులు హుండీల్లో పేరుకుపోకుండా ఉండటానికి, సాయి సంస్థాన్ సభ్యులు విదేశీ కరెన్సీని తీసుకోకూడదని నిర్ణయించారు. అలాగే భక్తులను హుండీల్లో వేయొద్దని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆలయంలో భక్తులు విదేశీ కరెన్సీని హుండీల్లో వేయకూడదని మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో రాసి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details