ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం

ETV Bharat / videos

ఆంజనేయుడి రథోత్సవం.. హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం - news on Anantapur District

By

Published : Feb 26, 2023, 8:08 PM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డెపాళ్యం గ్రామంలో  వీరాంజనేయస్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది.  మాములుగా అయితే భక్తిని చాటుకోవడానికి తమ ఆస్తులను దానం చేయడమో లేదా.. దేవాలయాలను కట్టించడమో.. ఇతర సేవలు చేయడమో  మనం తరచూ చూస్తుంటాం. అయితే  కర్ణాటక రాష్ట్ర చెళ్లకెరకు చెందిన భక్తుడు రఘుమూర్తి స్వామి అందుకు భిన్నంగా తన భక్తిని చాటుకున్నాడు.  రథోత్సవంలో స్వామివారిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. హెలికాప్టర్​ నుంచి పెళ్లిళ్లకు, రాజకీయ పార్టీ నేతల సభలు నిర్వహించిన సమయంలో అప్పడప్పుడు హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం కురిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీరాంజనేయస్వామి వారి రథోత్సవం తన భక్తిని అందరికంటే భిన్నంగా చాటుకున్నాడు. హెలికాప్టర్ ద్వారా వీరాంజనేయస్వామి ఊరేగింపుగా వస్తున్న రథంపై పూలను కురిపించాడు. అలా ఐదు నిమిషాలపాటు పువ్వుల వర్షం కురిసింది. ఈ సన్నివేశాన్ని చూడడానికి మన రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వందల సంఖ్యలో భక్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు రఘుమూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ABOUT THE AUTHOR

...view details