ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Flood_Water_Stocked_In_School_at_Nellore

ETV Bharat / videos

పాఠశాలలో వరదనీరు - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు - నెల్లూరు జిల్లాలో మిగ్​జాం తుపాను ప్రభావం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 10:21 PM IST

Updated : Dec 6, 2023, 11:03 PM IST

Flood Water Stocked In School at Nellore: నెల్లూరు జిల్లాను మిగ్​జాం తుపాను గత మూడు రోజులుగా అతలాకుతలం చేస్తోంది. నెల్లూరులో గత మూడు రోజులుగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవటంతో పట్టణ ప్రాంతమంతా జలమయమయ్యింది. దాదాపు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సంగం మండలం అన్నారెడ్డిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పాఠశాలలోకి వెళ్లాలంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. పాఠశాల అవరణలో భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. 

పాఠశాలలో భారీగా వరద నీరు చేరటంతో విద్యార్థులు పాఠశాలకు రావటానికి అవస్థలు పడుతున్నారు. నీరు అక్కడే నిల్వ ఉంటే రోగాల భారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు చేరి అపరిశుభ్రంగా మారితే పిల్లలు పాఠశాలలో ఎలా ఉంటారని విద్యార్థులతల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది త్వరగా వర్షపు నీటిని తొలగించాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.

Last Updated : Dec 6, 2023, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details