ఆంధ్రప్రదేశ్

andhra pradesh

flexi_fight

ETV Bharat / videos

ఫ్లెక్సీల్లో రెచ్చగొట్టే నినాదాలు - అధికార, ప్రతిపక్ష పార్టీ శ్రేణుల ఘర్షణ - YCP leaders Anarchy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 5:28 PM IST

Flexi Fight Between TDP, Janasena and YCP Leaders in Palnadu District:రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకుల అరాచకాలకు అంతులేకుండా పొతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల వారు సమావైశాలు నిర్వహించినా ర్యాలీలు చేసినా చివరకు ఫ్లెక్సీలు పెట్టుకున్నా వారు అడ్డుపడతారు. పోలీసులు కూడా వైసీపీ నాయకులకే అండగా ఉండటంతో వారి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. 

పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీ నేతల ఫ్లెక్సీల వివాదాలు ఉద్రిక్తతకు దారి తీసింది. పల్నాడు ఉత్సవాల సందర్భంగా పోటాపోటీగా కార్యకర్తలు అధికార, ప్రతిపక్షం పార్టీ నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బ్యానర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వాటిపై రెచ్చగొట్టే నినాదాలు ఉండటం వల్ల పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అదుపు చేశారు. వివాదాలు దారితీసే రాజకీయ నేతల ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని పోలీసులు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details