ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Flexi_Dispute_Between_TDP_and_YSRCP_Members_In_Tirunallu

ETV Bharat / videos

'దాడి చేసింది వారు - అరెస్టు చేసింది మమ్మల్ని' - తిరునాళ్లలో ఫ్లెక్సీ వివాదం - gurajala flexi dispute

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 1:04 PM IST

Updated : Dec 27, 2023, 1:25 PM IST

Flexi Dispute Between TDP and YSRCP Members In Tirunallu: తిరునాళ్లలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా తెలుగుదేశం వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని కొందరు వైసీపీ కార్యకర్తలు మంగళవారం రాత్రి చించివేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం వర్గీయులు వైసీపీ బ్యానర్లు కొన్నింటిని చించారు. 

TDP Members Arrested in Palnadu: దీంతో ఇరువర్గాల వారు గుంపులుగా రావడంతో ఘర్షణ నెలకొని ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. టీడీపీ వర్గీయుల ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిలిపి వేసి నలుగురిని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు. మేం ఏర్పాటు చేసుకున్న బ్యానర్లను చింపడమే కాకుండా మాపైన దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి మమ్మల్ని స్టేషన్​కు తీసుకెళ్లడం న్యాయమా అని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లెక్సీలు ఎందుకు చింపారని వైసీపీ నేతలను అడగితే మాపైనే తిరగబడ్డారని వారు తెలిపారు.

Last Updated : Dec 27, 2023, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details