ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Flexi_dispute_between_Janasena_and_YCP_in_Pedana

ETV Bharat / videos

Flexi Dispute Between Janasena and YCP in Pedana: పెడనలో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం.. రంగంలోకి దిగిన పోలీసులు - Pawan Kalyan Varahi Yatra updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 4:07 PM IST

Flexi Dispute Between Janasena and YCP in Pedana :జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో కృష్ణా జిల్లా పెడన పట్టణంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల  వివాదం (Flexi War in Pawan Kalyan Varahi Yatra)   నెలకొంది. పవన్ కల్యాణ్​కు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ సభ నిర్వహించే ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన జగన్ ప్లెక్సీ కనబడకుండా జనసేన నేతలు పవన్​కు స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు చేశారంటూ వైసీపీ కౌన్సిలర్ గరికముక్కు చంద్రబాబు ఆరోపించారు. తమ బ్యానర్ కనబడకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించాలని ఆందోళన చేపట్టారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. 

Janasena Leaders Fire on Police Notice Issued to Pawan Kalyan :పెడన సభలో అసాంఘిక శక్తులు అలజడులు సృష్టించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారని, ఇందులో తప్పు ఏముందో అర్ధం కావడం లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖ విచారణ చేసి, నేరాలను అదుపు చేయాలని, తమను వివరాలు అడగడం ఏంటని ప్రశ్నించారు. తమకు ఉన్న సమాచారం పోలీసులకు ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. రాజకీయ ప్రేరేపితంతోనే పవన్ కల్యాణ్​కి నోటీసులు ఇచ్చారంటూ విమర్శించారు. అమలాపురంలో ఏం జరిగిందో పోలీసులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారాహిని అడ్డుకోవాలనే ఇటువంటి చర్యలు చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details