ఆంధ్రప్రదేశ్

andhra pradesh

golden turtle in Sri Sathyasai

ETV Bharat / videos

golden turtle: బంగారు వర్ణం తాబేలు.. వీడియో వైరల్​ - ఏపీ క్రైం

By

Published : Jul 8, 2023, 12:38 PM IST

Updated : Jul 9, 2023, 8:05 AM IST

 golden turtle in Sri Sathyasai district: మాములుగా తాబేళ్లు అన్ని ఒకే  రంగులో ఉంటాయి. వాటిల్లో పలు రకాలు ఉన్నప్పటికీ రంగులో ఏ మాత్రం మార్పు ఉండదు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న తాబేలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందుకు కారణం ఇది మామూలు తాబేలుగా కాకుండా బంగారు వర్ణంలో ఉండడమే. ఈ తాబేలు శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో కనిపించింది. గ్రామంలోని  చెరువులో శుక్రవారం మత్స్యకారులు చేపల కోసం వల వేశారు. మెుదట చేపలు పడగా.. మరో సారి వల వేసినప్పుడు వారికి  బంగారు వర్ణంలో ఉన్న అరుదైన తాబేలు చిక్కింది. చేపలు పట్టే యువకులు దానిని ఒడ్డుపైకి తీసుకువచ్చారు. ఆ బంగారు వర్ణంలో ఉన్న తాబేలు వీడియోలు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ తాబేలును చూడటానికి తరలివచ్చారు. చివరికు మత్స్యకారులు ఆ తాబేలును అదే చెరువులో వదిలారు. బంగారు వర్ణంతో ఉన్న ఈ తాబేలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు... అల్లూరి సీతారామరాజు జిల్లా తులసిపాక కూడలి వద్ద ఆంధ్రా నుంచి ఒడిశాకు తరలిస్తున్న 172  తాబేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో  ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆంధ్రా నుంచి ఆటోలో  తాబేళ్లను తరలిస్తుండగా లక్కవరం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. ఆ  తాబేళ్లను  స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. ఈ గఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టుకున్న  తాబేళ్లను శబరి నదిలో వదిలినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Jul 9, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details