Fireworks Burst with Loud Noise: తొస్సిపూడిలో బాణసంచా పేలుడు కలకలం.. భయంతో జనం పరుగులు - Fireworks Burst with Loud Noise
Fireworks Burst with Loud Noise in East Godavari : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడిలో మంగళవారం భారీ శబ్దంతో బాణసంచా పేలుడు కలకలం రేపింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో ఉలిక్కిపడిన తొస్సిపూడి వాసులు.. భయంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. గ్రామంలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో దాని పక్కనే ఉన్న పెట్రోల్ బంకు, రైస్ మిల్లు, సహా పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉందని తెలుపుతున్నారు. బాణసంచా అక్రమంగా నిల్వ చేయడం వలన ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొస్సిపూడిలో సహా పలు గ్రామాల్లో భారీ పేలుడుకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.