ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire breaks out in a private hospital in Vijayawada

ETV Bharat / videos

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం - సకాలంలో స్పందించడంతో తప్పిన ముప్పు - news on Massive fire breaks out in hospital

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 10:46 PM IST

Fire breaks out in a private hospital in Vijayawada:  విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంపైన ఉన్న ఏసీ పరికరాల్లో నిప్పురవ్వలు రావటంతో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. భవనం పైనుంచి మంటలు సైన్ బోర్డ్​కు వ్యాపించాయని తెలిపారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు లోపలికి వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఆసుపత్రిలో అగ్నిప్రమాదాన్ని నివారించే పరికరాలు ఉన్నాయని, అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది, రోగులను బయటకు తీసుకురాగలిగామని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 7 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు  పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details