Fire at Vasantha Towers in Vijayawada: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2023, 3:28 PM IST
Fire at Vasantha Towers in Vijayawada: విజయవాడ పటమటలంకలో అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. వసంత టవర్స్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగాయని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు.. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇంటికి తాళాలు వేసి ఉండటంతో నిచ్చెన సహాయంతో మొదటి అంతస్తుకు ఎక్కారు. అనంతరం డోర్ పగలకొట్టి మంటలు అదుపు చేశారు. మంటలు అదుపులోకి రావడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల వంట గదిలో ఉన్న రిఫ్రిజిరేటర్‌తో సహా పలు వస్తువులు దగ్ధం అయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.