ఆంధ్రప్రదేశ్

andhra pradesh

fire_accident

ETV Bharat / videos

ఆకతాయిల నిర్వాకం - మూసేసిన సినిమా​ థియేటర్​లో అగ్ని ప్రమాదం - అగ్ని ప్రమాదం న్యూస్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 2:56 PM IST

Fire Accident in Movie Theater in YSR District : కడప నగరం పాత బస్టాండ్​ సమీపంలోని రాయల్​ థియేటర్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. 10 సంవత్సరాలుగా మూసేసిన థియేటర్​ ఆకతాయిలకు అడ్డగా మారింది. స్థానిక ఆకతాయిలు రాత్రిపూట మద్యం తాగి సిగరెట్​ ఆర్పకుండా పడేసి వెళ్లారు. దీంతో నిప్పు రవ్వలు అక్కడ ఉన్న సీట్లకు అంటుకోవడం వల్ల  ఉదయం ఒకసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో థియేటర్​లోని సీట్లు అన్ని దాదాపుగా కాలిపోయాయి.

Firefighters Fighting Fires : గురువారం ఉదయం స్థానిక దుకాణదారులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగిసిన పడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. థియేటర్​ చుట్టూ వివిధ రకాల దుకాణాల సముదాయాలు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు ఆర్పడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details