ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆకతాయిల దుశ్చర్య - కాకినాడలో అగ్ని ప్రమాదం - Fiber seats in Kakinada district

🎬 Watch Now: Feature Video

Fire_Accident_in_Kakinada_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:50 PM IST

Fire Accident in Kakinada District : కాకినాడ ఏటిమొగ్గ వద్ద నిల్వ ఉంచిన ఫైబర్ షీట్లు అగ్ని ప్రమాదానికి గురికావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైయ్యారు. రాజీవ్ గృహకల్ప సమీపంలో నిల్వ ఉంచిన ఫైబర్ షీట్లు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్క అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రాంతంతో దాదాపు ఐదు సంవత్సరాలుగా ఫైబర్ షీట్లు అక్కడే ఉన్నాయని పోలీసులు తెలిపారు. గంజాయి తాగే వారు, ఆకతాయిలు సిగరెట్టు తాగి విసిరేయటంతో ఫైబర్ షీట్లు అగ్నికి ఆహుతి అయినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.  

భారీగా చెలరేగిన మంటలకు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో రాజీవ్ గృహకల్ప నివాసితులు తీవ్ర భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. నిత్యం ఈ ప్రాంతంలో గంజాయి తాగే యువకులు అధికమయ్యారని, ఆడపిల్లలను బయటకు పంపించేందుకు భయపడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details