ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire Accident in Ganesh Immersion Celebrations

ETV Bharat / videos

Fire Accident in Ganesh Immersion Celebrations: గణేష్ నిమజ్జన సమయంలో.. కాంతారా సినిమా పాటకు డ్యాన్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం - Fire Accident in Ganesh Immersion

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 3:59 PM IST

Fire Accident in Ganesh Immersion Celebrations: చిన్నపిల్లలు గణేష్ నిమజ్జనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఎంతో ఉత్సాహంగా వినాయక ఊరేగింపుని చూద్దామని వచ్చిన చిన్నపిల్లలు తీవ్ర గాయాలు పాలయ్యారు. గణేష్ నిమజ్జన ఊరేగింపులో జరిగిన ప్రమాదంలో చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ వినాయక నిమజ్జనం ఊరేగింపులో అపశృతి జరిగింది. కాంతారా సినిమా పాటకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి డ్యాన్స్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో చిన్నారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయలయ్యాయని వైద్యులు తెలిపారు. పోలీసు భద్రతా వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపించారు. పెట్రోల్ క్యాన్ పట్టుకొని జనం మధ్యలో వినాయక కమిటీ సభ్యులు తిరుగుతున్నా.. పోలీసులు వారిని నిలువరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహించారని చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details