ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాణసంచా అగ్నిప్రమాదం

ETV Bharat / videos

blast in cracker factory అనుమతిలేని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం - fire accident news

By

Published : May 28, 2023, 1:43 PM IST

fire accident in crackers factory రహస్యంగా బాణసంచా తయారీ ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరులో రహస్య ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రం ఏర్పాటు చేసి అందులో టపాసులు తయారు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ఏడుగురు పనిచేస్తుండగా.. రోజువారి లాగే ఏడుగురిలో ఐదుగురు మాత్రం కూలి పనులకు వెళ్లారు. వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా టపాసుల తయారీ కేంద్రంలో మందుగుండు సామాగ్రి పేలింది. దీంతో మంటలు చుట్టుప్రక్కల శరవేగంగా వ్యాపించి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా మొదట అందర్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా మారటంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దర్ని ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాణసంచా తయారీ కేంద్రాన్ని మాముడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నడిపిస్తున్నాడని.. అతను వైసీపీ నాయకుడి అనుచరుడని తెలుస్తోంది. ఈ బాణసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details