Doctorate to Cine Actor Vanisri: గీతం యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న సినీ నటి వాణిశ్రీ - AP Latest news
Doctorate to Cine Actor Vanisri: విశాఖపట్నం గీతం విశ్వ విద్యాలయ 14వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటి వాణి శ్రీకి గీతం విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. అనంతరం డాక్టరేట్ అందుకున్న సినీ నటి వాణి శ్రీ మాట్లాడుతూ తన చిన్నప్పుడు ఆర్ధిక పరిస్థితి బాగోలేక చదువుకోలేకపోయానని చెప్పారు. అందుకే ఈ రోజు వరకు పుస్తకాలు చదువుతూనే ఉన్నాను అని చెప్పారు. మన తరువాత తరం మినరల్ వాటర్ లేకుండా, ఆక్సిజన్ సిలెండర్ లేకుండా బ్రతకాలని అందుకే ప్రతి ఒక్కరు నెలకి ఒక మొక్క నాటాలని సూచించారు. వృక్ష శాస్త్రం చదువుకోలేదు..కానీ అనేక మొక్కలు గురుంచి తెలుసుకున్నన్నారు. సమాజానికే సేవ చేయడంలో బయ్యన్న గూడెం లో ఒక స్కూల్, 30 పడకల ఆసుపత్రి కట్టించినట్టు చెప్పారు. అప్పటి డైరెక్టర్ ల చలువ వల్ల ఇప్పటికి తాము నటించిన చిత్రాలు ప్రజల గుండెలో ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.
మరో గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ కోటా నారాయణ మాట్లాడుతూ ప్రపంచం పర్యవరణ కాపాడాలని అందుకు అందరూ కృషి చేయాలనీ కోరారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందుతుందని, స్టార్ట్ అప్ కంపనీ లో దేశంలో మూడో స్థానం లో ఉందని ప్రపంచంలో పిహెచ్డి చేస్తున్న ఎక్కువ యువత ఉన్న మూడో పెద్ద దేశం భారత్ అని అన్నారు.