Film Actress Anasuya Opened Shopping Mall in Nandyala: నంద్యాలలో సినీనటి అనసూయ సందడి.. ఫొటోల కోసం ఎగబడిన కుర్రకారు - Anasuya opened a shopping mall in Nandyala
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 2:56 PM IST
Film Actress Anasuya Opened Shopping Mall in Nandyala:ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత, సినీ నటి అనసూయ నంద్యాలలో సందడి చేసింది. పట్టణంలో ఓ నూతన షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు నంద్యాలకు వచ్చిన అనసూయ.. నవ్వులతో అభిమానులను ముంచేసింది. అనసూయను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడకు జనం చేరుకున్నారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై అనసూయ డాన్స్ చేసి అభిమానులను అలరించారు. అక్కడకు వచ్చిన అభిమానులు అమెతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు.
అందుకే జబర్దస్త్‌కు దూరం: ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోచా బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఇషాక్ బాషాలు పాల్గొన్నారు. ఆడవారు ఆనందంగా ఉండాలంటే అందంగా ఉండాలని.. అందుకు షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేయాలని అనసూయ అన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వుతూ ఉంటాను.. సీరియస్ పాత్రలు సినిమాల్లో ఉండడం వల్ల అభిమానులు కన్ఫ్యూస్ అవుతున్నారని.. అందువల్లే జబర్దస్త్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.