ఆంధ్రప్రదేశ్

andhra pradesh

film_actor_rajakumar_visited_temple

ETV Bharat / videos

టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం: సినీ నటుడు రాజ్​కుమార్ - ఆంజనేయస్వామిని దర్శించుకున్న రాజ్​కుమార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 6:13 PM IST

Film actor Rajakumar visited temple : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు బెయిల్ రావడంపై సినీ ప్రముఖులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి దర్శకేంద్రుడు కె.రాఘవేద్రరావు ట్వీట్ చేయగా.. సినీ నటుడు రాజకుమార్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన జిల్లా ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. 

ఈ సందర్భంగా రాజ్​కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తున్నానని, తన సొంత ఊరు గుంతకల్లు అని తెలిపారు. టీడీపీ సర్వేలో తన పేరు ముందు వరుసలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా లేదంటే ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ తనకు టికెట్ ఇవ్వడం కుదరకపోయినా..  తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని రాజ్​కుమార్ చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details