Fight Between YCP Two Group : రణరంగంలా మారిన వైసీపీ సమావేశం .. నాయకుల సమక్షంలో కుర్చీలతో కొట్టుకున్న వైనం - వైసీపీ పార్టీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 8:35 AM IST
Fight Between YCP Two Group : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడిలో వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన వర్గపోరులో ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ కమిటీ నియామకం కోసం సచివాలయంలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో రెండు వర్గాల మధ్య వర్గపోరు ఘర్షణకు దారి తీసింది. వైసీపీలోని ఒక వర్గం వారు సమావేశానికి జనసేన పార్టీకి చెందినవారు వచ్చారంటూ మరో వర్గాన్ని ప్రశ్నించారు. ఘటనను మెుబైల్‌లో వీడియో తీస్తుండగా రెండు వర్గాల్లోని యువకుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా.. ముదిరి కుర్చీలతో ఒకరిపై మరొకరు ఎదురు దాడులు చేసుకున్నారు. దాడిలో ఒక వర్గానికి చెందిన ఆడపా వెంకన్న, మేడిన ప్రసాద్, మరో వర్గానికి చెందిన పాల్ ఫ్రాన్సిస్, ఏడిద పండు, కిషోర్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ సీనియర్ల సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకోవటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయటంపై ప్రతిపక్షనేతలు అధికారులను నిలదీస్తున్నారు.