సదరన్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్లో ముందస్తు దీపావళి వేడుకలు - southern hotel news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 1:41 PM IST
Festival Should Be Celebrated Pollution Free Manner Diwali Program: విశాఖపట్నంలో హరిత ముందస్తు దీపావళి కార్యక్రమం సందడిగా జరిగింది. సదరన్ హోటల్ మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్ విద్యార్ధినీ విద్యార్ధులు, అధ్యాపక సిబ్బంది, నిర్వాహకులు అంతా కలసి సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలను అత్యంత కళాత్మకంగా అలంకరించారు. మరో వైపు ఒక్కొక్కరూ ఒక్కో సంప్రదాయ మిఠాయిలను తయారు చేసి వాటిని చక్కగా అమర్చారు.
కాలుష్యం అనేది ప్రస్తుతం దేశంలో ఎంత విపరీతంగా ఉందో అందరికీ తెలిసిందే.అందుకే మన రాష్ట్రాన్నికానీ, దేశాన్నీకానీ కాలుష్యం చేయవద్దు అనే ముఖ్యఉద్దేశంతోనే టపాసులు వంటివి కాల్చకుండా దీపాలు మాత్రమే వెెలిగించి ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ దీపావళిని ఆనందంగా జరుపుకోండి. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి తప్ప కాలుష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి .-సదరన్ హోటల్ మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్ అధినేత,సతీష్ పొన్నం.
పూతరేకులు, లడ్డూలు, కాజాలు, గారెలు, పులిహోర, పంచదార చిలకలు,అరిసెలు, జంతికలు, చక్కిలాలు వంటివి విద్యార్ధినీ విద్యార్ధులే స్వయంగా తయారు చేశారు. లక్ష్మీ పూజను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. పండుగను కాలుష్య రహితంగా జరుపుకునేందుకు ఉన్న మార్గాలను వివరిస్తూ అందరూ ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పూతరేకులు, లడ్డూలు, కాజాలు, గారెలు, పులిహోర, పంచదార చిలకలు,అరిసెలు, జంతికలు, చక్కిలాలు వంటివి విద్యార్ధినీ విద్యార్ధులే స్వయంగా తయారు చేశారు. లక్ష్మీ పూజను సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. పండుగను కాలుష్య రహితంగా జరుపుకునేందుకు ఉన్న మార్గాలను వివరిస్తూ అందరూ ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.