ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Felicitation_to_Kosaraju_Veeraiah_Couple

ETV Bharat / videos

"నేటి తరం పిల్లలు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి" - కొసరాజు వీరయ్య చౌదరి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 11:30 AM IST

Felicitation to Kosaraju Veeraiah Chowdary Couple  : నేటి తరం పిల్లలు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పావులూరి సరోజినీ దేవి (Pavuluri Sarojini Devi), బాపయ్య చౌదరి ట్రస్టు (Bapayya Chowdary Trust) ఆధ్వర్యంలో కేవీ చౌదరి, పున్నమ్మ దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేవీ చౌదరి మాట్లాడుతూ.. పుట్టుకతోనే ప్రతి జీవి రుణగ్రస్తులై జన్మిస్తారని అన్నారు. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరాముని 16 సద్గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. 

జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించడం, వారి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలని కేవీ చౌదరి తెలిపారు. పావులూరి ట్రస్ట్ చేస్తున్న సేవలును అభినందించారు. తల్లిదండ్రులను ఆదరిస్తూ, బిడ్డలుగా కర్తవ్యం నెరవేరస్తు ఆదర్శంగా జీవిస్తున్న దంపతులకు పావులూరి ట్రస్టు ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా సన్మానాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాతూరు నాగభూషణం, రామినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామినేని ధర్మ ప్రచారక్, వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details