విజయవాడ స్టెల్లా కళాశాలలో ముందుస్తు క్రిస్మస్ వేడుకలు - అలరించిన అమ్మాయిల ఫ్యాషన్ షో పోటీలు - vijayawada fashion show
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 9:36 PM IST
Fashion Show Competitions in Stella College :ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా విజయవాడ మేరిస్ స్టెల్లా కళాశాలలో ఫెస్ట్ స్పార్క్ పేరుతో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షో కు విద్యార్థినిల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సంప్రదాయ, పాశ్చత్య వస్త్రధారణలో విద్యార్థులు ర్యాంప్ వాక్ చేశారు. అమ్మాయిల కేరింతలతో కాలేజి ప్రాంగణం సందడిగా మారింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులను అందజేసింది. విద్యార్థులలో సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఏటా ఈ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు కాలేజి మేనేజ్మెంట్ వెల్లడించింది.
కేవలం ఫ్యాషన్ షో లాంటి కార్యక్రమాలే కాకుండా, విద్యార్ధినులు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని నిర్వాహాకలు తెలిపారు. ఈ విభాగంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అనాథాశ్రమాల్లో ఉన్న వారికి సాయం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థినుల్లో ఈ తరహా సామాజిక కార్యక్రామాల్లో అవగాహన కల్పించడం ద్వారా వారిలో సృజనాత్మకతతో పాటు, జీవితం పట్ల మాంచి ధృక్పథాన్ని ఏర్పరుచుకుంటారని వారు చెప్పారు. అటు యాజమాన్యం నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంలో పాల్గొనడం తమకు చాలా ఆనందంగా ఉందని విద్యార్థినులు తెలియజేశారు.