ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారుల కాలయాపన - రోడ్డుపై రైతుల ఆందోళన - social news in srikakulam district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 1:37 PM IST
Farmers Protest in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసింహపేట మండలంలో రైస్ మిల్లు ముందు రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లు యాజమానులు, సచివాలయ సిబ్బంది ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా ధాన్యం ట్రాక్టర్లుతో మిల్లు, సచివాలయ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే సంబంధిత శాఖ అధికారులు వివిధ కారణాలు చెప్పి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోయారు.
Demand to Buy Grain : ధాన్యం ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా పెట్టి రైతులు నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చేచెప్పే ప్రయత్నం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు ట్రాక్టర్లను తీయమని రైతులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోసమస్య పరిష్కారం చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.