డోన్, ప్యాపిలిని కరవు మండలాలుగా ప్రకటించాలి - ఆర్డీవో కార్యాలయం ముట్టడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 6:47 PM IST
Farmers Protest In Nandyala District :నంద్యాల జిల్లాలోని డోను, ప్యాపిలిలను కరవు మండలాలుగా ప్రకటించాలని, ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారాన్ని రైతులకు అందజేయాలని సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ నుంచి కార్యాలయం వరకు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఐ నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
CPI Leders And Farmers Protest At RDO Office :అదే సమయంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామాన్ ఓటర్ జాబితాను పరిశీలించేందుకు తాసిల్దార్ కార్యాలయానికి రావడంతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు సీపీఐ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులను తోసుకొని తాహల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సీపీఐ నాయకులు డోన్, ప్యాపిలిలను కరవు మండలలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ కరవు మండలాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.