నిలిచిపోయిన తుంగభద్ర ప్రవాహం - హంద్రీనీవా నుంచి కృష్ణా నీటిని తరలించాలని రైతుల భారీ ర్యాలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 2:28 PM IST
Farmers Protest in anantapur District :అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కి (Guntakallu Branch Canal) తుంగభద్ర నీటి ప్రవాహం ఆగిన నేపథ్యంలో హంద్రీనీవా నుంచి కృష్ణా నీటిని తరలించాలని విడపనకల్లులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయని ఇందులో 25 వేల ఎకరాల్లో మిరప పంట సాగులో ఉందన్నారు. ప్రస్తుతం మిరప పిందె దశలో ఉందని పంటకు నీరు చాలా అవసరమని తెలిపారు.
Guntakallu Branch Canal Latest Issue : ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నీటిని తరలించి టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని అదే విధంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే తుపాను కారణంగా తాము ఎంతో నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరో సమస్య తలెత్తితే రైతన్నల భవిత అగమ్య గోచరం అవుతుందని వారు వాపోయారు.