Farmers Protest for Electricity: పగటిపూట విద్యుత్ సరఫరా చేయాలని.. మాళపురం విద్యుత్ స్టబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన - ఏపీ రైతులు సమస్యల వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 5:58 PM IST
Farmers Protested for Electricity at Vidapanakal : పొలాలకు తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని రైతులు మాళపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
మాళపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను కోరారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని.. వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తే.. పొలాలకు బోర్ల ద్వారా నీటిని మళ్లించుకుని పంటలు పండించుకుంటామని అన్నారు. పొలాలకు సక్రమంగా విద్యుత్ ఎందుకు ఇవ్వటం లేదని రైతులు అధికారులను ప్రశ్నించారు. రాత్రి పూట వద్దు.. కనీసం పగటి సమయంలో విద్యుత్‌ను సరఫరా చేస్తే చాలు అని రైతులు అధికారులను డిమాండు చేశారు.