ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmers_problems_due_michaung_in_visaka_district

ETV Bharat / videos

మిగ్​జాం తుపానుతో డీలా పడ్డ రైతన్న- పరిహారమన్నా ఇయ్యన్నా జగనన్న! - అనకాపల్లి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 1:20 PM IST

Farmers Problems Due Michaung  In Visaka District : ఉమ్మడి విశాఖ జిల్లాలో మిగ్​జాం తుపాను ప్రభావం వరి,  చెరకు, మెుక్కజొన్నలకు తీవ్ర నష్టం కలిగించింది. దీనిపై అధికార యంత్రాంగం నష్టం అంచనా వేస్తాం అన్నట్లుగా ఊదాసీనతగా రైతులను కుంగదీస్తుంది. ఈ ప్రభావం వల్ల ఎక్కడా గుప్పెడు  గింజలు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేల ఎకరాల్లో నష్టం జరిగిందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి పిడికెడు మెతులు దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు.  

Crops Destroyed by Cyclone Effect In Anakapally : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారిని పట్టించుకుని నష్టపోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత అన్నదాతలు కోరుకుంటున్నారు. ఎకరానికి కనీసం ఇరవై వేలైనా ఇవ్వకపోతే తదిపరి పంట వేసే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను కారణంగా వారికి కన్నీరే మిగిలిందని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details