ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాట్రగడ్డలో చనిపోయిన ఏనుగులకు కర్మకాండలు

ETV Bharat / videos

Rituals For Dead Elephants: చనిపోయిన ఏనుగులకు కర్మకాండలు.. ఎక్కడంటే..! - తెలుగు ప్రధాన వార్తలు

By

Published : May 24, 2023, 10:31 PM IST

Rituals For Dead Elephants In Katragadda : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ వద్ద మే 12వ తేదీన 6 ఏనుగుల గుంపులో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. వీటిని అటవీశాఖ అధికారులు మృతి చెందిన స్థలంలోనే రైతు అనుమతితో అక్కడే పూడ్చి పెట్టారు. కొన్ని నెలల పాటు ఆ ఏనుగులు చుట్టూ పక్కల గ్రామాల్లో సంచరిస్తూ ఉండేవి. అక్కడి ప్రజలకు ఆ ఏనుగులతో వారికే తెలియని అనుబంధం ఏర్పడింది. ఆ గుంపులో నాలుగు ఏనుగులు కనపడకపోవడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. వారి ఇంట్లో మనిషి కాలం చేశారనే ఉద్ధేశ్యంతో భావోద్వేగానికి లోనయ్యారు. సమీప గ్రామాల ప్రజలు ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం మృతి చెందిన ఏనుగులకు విన్నారావ్ పొలంలోనే అదే గ్రామానికి చెందిన తోట సింహాచలం ఆధ్వర్యంలో మనుషులకు జరిపించినట్టుగానే కర్మకాండలు జరిపించారు. పిల్లిగూడ, బొమ్మిక, పసుపుడి భద్ర, కాట్రగడ గ్రామాలకు చెందిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనుషులకు చేసినట్టుగానే వేద పండితులతో కర్మకాండలన్నీ శాస్రోక్తంగా జరిపించారు. అనంతరం గ్రామస్థులకు భోజనాలు ఏర్పాట్లు సైతం చేశారు. గజరాజులకు గ్రామస్థులంతా కన్నీటి వీడ్కోలు పలికారు. ఏనుగులకు ఆ ప్రాంతీయులతో అల్లుకున్న బంధానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details