రైతు భరోసా కేంద్రానికి తాళం వేసిన రైతులు.. ఎందుకంటే..! - AP Latest News
Farmers Locked to Rythu Barosa Kendram: వ్యవసాయమే తప్ప మరోక వ్యాపకం తెలియని అన్నదాతలు.. రైతు భరోసా కేంద్రం అధికారుల వేధింపులు తట్టుకోలేక ఏకంగా రైతు భరోసా కేంద్రానికే తాళాలు వేశారు. ధాన్యం కొనుగోలును ప్రభుత్వం నిలిపివేయడంతో రైతు భరోసా కేంద్రం అధికారుల సూచనతో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యాన్ని అఫ్లైన్లో విక్రయించారు. ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం విక్రయాలను ఆన్లైన్ చేయడాన్ని ప్రారంభించడంతో తాము విక్రయించిన ధాన్నాన్ని ఆన్లైన్ చేయమంటే అధికారులు వీలు కాదని చెబుతున్నారని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ధాన్యం విక్రయించిన తమ పరిస్థితి ఏంటని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. యలమర్రు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమకు ధాన్యం డబ్బులు రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యలమర్రు గ్రామంలో రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.